Click on Telugu to change language

జీవిత చరిత్ర

మర్రి ఆదిత్య రెడ్డి

శ్రీ మర్రి ఆదిత్య రెడ్డి

 

శ్రీ మర్రి ఆదిత్య రెడ్డి గారు సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు MLA గా గెలిచిన శ్రీ మర్రి శశిధర రెడ్డి గారి కుమారుడు మరియు రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కు ముఖ్యమంత్రిగా, నాలుగు రాష్ట్రాలకు (పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్) గవర్నర్‍గా పని చేసి విస్తారమైన రాజకీయ అనుభవం, చరిత్ర కలిగిన Dr. మర్రి చెన్నారెడ్డి గారి మనుమడు. 

 

తన ముందు తరాల బాటలోనే శ్రీ ఆదిత్య కూడా తెలంగాణ రాష్ట్రం పై ప్రభావం చూపిస్తున్న మౌలిక అంశాలైన సామాజిక, ఆర్ధిక సమస్యల పైనే కాక మానవ హక్కులు, మహిళల సాధికారత, విద్య, యువత యొక్క నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలు, ఈ-గవెర్నెస్, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల పైననే కాక రైతు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అకుంఠిత దీక్షతో ప్రజలనుద్దేశించి ప్రస్తావించటమే కాక ప్రసంగిస్తున్నారు. 

 

అంకిత భావంతో గ్రామీణ, పట్టణ ఉపాధి మరియు ప్రజా సంక్షేమాల దిశగానే కాక ప్రజలు రాజకీయాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా సంఘంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి అవకాశాలు పొందాలని కృషి చేస్తున్నారు. 

 

ప్రజలందరికి సమానత్వం, న్యాయం అందాలనే ఆదిత్య “ఒట్టి మాటలు చెప్పటం కాదు చేతలలో చేసి చూపాలనే” సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఈ సిద్ధాంతాన్ని ఆయన నియోజక వర్గంలో ఒక అంకిత భావంతో ఆయన ఫౌండేషన్ అయిన MCRF లో ప్రతిబింబింప చేస్తున్నారు. 

 

తన అంకితభావమైన సేవలతో రాష్ట్రాన్ని సుసంపన్నవంతంగా మార్చగలననే తాను కనే కలలను నిజం చేయగలనని అనంతమైన, అమితమైన నమ్మకం కలిగిన వ్యక్తి శ్రీ ఆదిత్య. 

 

మనం కలలు కన్న అంశాలను సాధించాలంటే ఎదురయ్యే సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొని పోరాడి సాధించుకోవాలనే విషయంపై శ్రీ ఆదిత్య గారికి మంచి అవగాహన ఉంది. 

 

మనకి ఏదైనా కావాలంటే మనకై మనం దాన్ని సాధించుకోవాలి. శ్రీ ఆదిత్య గారు చేపట్టిన అన్ని కార్యక్రమాలలో అదే విషయం మనకి కనిపిస్తుంది. 

 

తాను తీర్చిదిద్దాల్సిన కార్యక్రమాలు ఏమి లేని సమయంలో దినసరి వేతనాలు సంపాదించుకొనే వారి గురించి, తెలంగాణా రాష్ట్రం లోని సామాన్య ప్రజల గురుంచి మరియు రైతుల సమస్యలు గురించి వింటూ వారినుద్దేశించి ప్రసంగిస్తూ వారి ప్రశ్నలకు, వారి సమస్యలకు వినూత్నమైన రీతిలో పరిష్కారాలు అందచేస్తుంటారు శ్రీ ఆదిత్య. ఆదిత్యగారు చేపట్టిన కార్యక్రమాలు, పనుల జాబితాను పరిశీలించటం ద్వారా అయన పని తీరుపై మనకి ఒక చక్కని అవగాహన కలుగుతుంది.  

Copyright @ 2018. All Right Reserved. adithyamarri.com

Bitnami