Click on Telugu to change language

మహిళాసాధికారత

మహిళల హక్కులు, వారి విద్య ఉపాధి అవకాశాల కోసం స్థిరంగా కృషి చేస్తూ, వారి తరపున ధృడంగా వాదించే వ్యక్తి శ్రీ ఆదిత్య గారు. ఇటీవల Mc Kinsey & Co  వారి అధ్యయనం ప్రకారం భారతదేశంలో మహిళల ఉపాధి, శ్రామిక శక్తి వినియోగం 25% మాత్రమే. రాబోయే 7 సంవత్సరాల కాలంలో అదనంగా 10% మహిళా శ్రామిక శక్తి పెరిగినట్లైతే దేశానికి 770 బిలియన్ డాలర్ల నికర గృహ ఉత్పాదకత పెరుగుతుందని, మహిళలు ఈ సమాజానికి వెన్నుముక వంటి వారు అని శ్రీ ఆదిత్యగారి గట్టి నమ్మకం. లింగవివక్షతపై ఆధారపడి దేశంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గించరాదని వారి భావం. శ్రీ ఆదిత్యగారు MCR ఫౌండేషన్ నుంచి ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ ఈ వివక్షను క్రిందస్థాయి నుంచి నివారిస్తూ, మహిళలలో చైతన్యస్ఫూర్తిని నింపుతూ, వారికి జారుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం ద్వారా దేశాన్ని సమర్ధవంతంగా ప్రగతిపథంవైపు నడిపిస్తున్నారు. 

 

మహిళా సామర్ధ్యం పెంపుదల దిశగా శ్రీ ఆదిత్యగారి లక్ష్యాలు:

 • మహిళలు చేసే వ్యాపార నిర్వహణకు తోడ్పాటు – సెల్ఫ్ హెల్ఫ్ గ్రూఫుల పెంపుదల 
 • గ్రామీణ మహిళలకు విద్యావకాశాలు కల్పించటంద్వారా వారు ఏ హద్దులు లేని జీవన ప్రమాణాలు సాధించటం. 
 • రాష్ట్రంలోని గ్రామీణ మహిళలందరికీ స్థిరమైన, అనుకూలమైన ఉపాధిని ఏర్పాటు చేయటం. 
 • గ్రామీణ మహిళలను స్వేచ్చాదిశగానూ, ఆర్థికపరమైన భద్రతవైపు నడిపించటం. 
 • మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రేరణ మరియు గ్రామీణ మహిళా గళానికి మద్దతునివ్వటం 
 • లింగ వివక్షపై అవసర ప్రసంగాలు మరియు మద్దతును అందించటం.  

 

ప్రస్తుతం శ్రీ ఆదిత్యగారు ఈ లక్ష్యాలను అమలు పరుస్తున్న తీరు:

 • దేశ ఆర్ధిక ప్రగతిలో కీలక పాత్ర వహించే స్థూల వ్యాపార సంస్థలకు మద్దతునివ్వటం 
 • Girls in Tech (గర్ల్స్ ఇన్ టెక్) అనే కార్యక్రమాన్ని ముందుకి నడిపించటానికి MCR గారు కీలక సలహాదారుగా పనిచేస్తున్నారు. అవిశ్రాంతంగా ఆయన చేస్తున్న కృషి కారణంగా IT పరిశ్రమలో మహిళలు సంస్థాపకులుగా మరియు పారిశ్రామికవేత్తలుగా ఇరు రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారు. ఇవి కొన్ని ప్రమాణాల ఫలితాలు. 
 • నెట్ వర్క్ విధానంలో అవకాశాలను అందించటం ద్వారా మెంటర్లుగా ఇతరులకు ఉతేజాన్ని కలిగించే విధంగా, నైపుణ్యాలను పెంపొందించుకొని నాయకత్వలక్షణాలతో ఎదిగి, పారిశ్రామిక వేత్తలుగా ఇతర మహిళలకు స్ఫూర్తిని అందించటం ఈ కార్యక్రమ లక్ష్యం. మహిళలలోని వ్యాపార నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను వారికి అవకాశాల రూపంలో సృష్టించి అందించటం ద్వారా వారిలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని వెలికితీయడం. 
 • మహిళలను సమావేశపరచి, విద్యాసంభంధిత కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయటంద్వారా వారిలో యాజమాన్య నైపుణ్యాలను పెంపొందించటం. 
 • ఉత్పాదకత మరియు యాజమాయంలో మహిళలకు అవసరమైన వృత్తిశిక్షణ అందించటం ద్వారా వారి నైపుణ్యాలు పెంపొందించటం. 
 • పాలిటెక్నీక్ మరియు విద్యాసంస్థలలో శిక్షణా మరియు ఉత్పాదక సంబంధిత ఈవెంట్స్ చేయటంద్వారా మహిళల్లో నైపుణ్యాభివృధికి దోహదపడటం. 
 • ఎదుగుదల అంతగా లేని మహిళా పారిశ్రామికవేత్తలను ఉత్సాహపరచటానికి, వారికి అవసరమైన సైకలాజికల్ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం ద్వారా వారి ఉత్పాదకతను పెంపొందించటానికి తగిన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తారు. 

 

  

Adithya Marri Reddy Women Empowerment

పనులు

తెలంగాణ ప్రజలకు అంకితం చేయపడిన

వ్యవసాయం

రైతుల సహాయం మరియు వ్యవసాయ సంఘం

Adithya Marri Reddy Potography Pothole

పట్టణ అవస్థాపన

పట్టణ అవస్థాపన అభివృద్ధి వైపు కృషి చేయడం

Adithya Marri Reddy Agriculture

వాతావరణ మార్పు

రాబోయే తరానికి ప్రభుత్వంలో సరైన మార్పులు చేయడం

విద్య 

అందరి విద్య కోసం కట్టుపడ్డాం

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి పట్ల కట్టుపడ్డాం

Copyright @ 2018. All Right Reserved. adithyamarri.com

Bitnami