Click on Telugu to change language

పర్యావరణమార్పులు

Adithya Marri Reddy Climate change

తెలంగాణా ప్రజల జీవన విధానం మన చుట్టుప్రక్కల ఉన్న అటవీ ప్రాంతం, వన్యప్రాణులతో కూడిన ప్రకృతి పరిసరాలతో, చెరువులతో వేళ్ళూలుకుని ఉంది. మన పరిసరాలను మనం ఎలా కనుగొన్నామో వాటిని యధాతధంగా ఉంచటానికి ప్రయతించే దిశగా కృషి చేయాలి. పరిశుభ్రతను పాటించటం, పరిసరాలను రక్షించుకోవటానికి తగిన విధంగా స్పందిస్తూ, మన ముందున్న అతిపెద్ద ముప్పు అయిన వాతావరణంలోని మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. 

 

సికింద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ మరియు రామగుండం ప్రపంచంలోని అతిపెద్ద నైట్రోజెన్ డై ఆక్సయిడ్ ని విడుదల చేస్తున్న ప్రాంతాలుగా గుర్తింపబడ్డాయి. అంతేకాక హైదరాబాద్ కాలుష్యం నిండిన నగరాలలో 3వ స్థానంలో ఉన్న మెట్రోపాలిటన్ నగరంగా గుర్తింపబడింది. కాలుష్యం అనేది మనం పీల్చుకొనే గాలిపై విధింపబడిన పన్ను మాత్రమే కాదు — వ్యవసాయ ఉత్పత్తులపై చాలా వ్యతిరేక ప్రభావాలు చూపిస్తాయి అనేది ఎంత నిజమో అలాగే విస్తృతంగా / విశాలమైన వ్యవసాయాధారితమైన ఆర్ధికరంగంపైనా కూడా ప్రభావం చూపటం జరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయాధారితమైన దేశం మనది. 

 

వాతావరణ మార్పు అనే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆ మార్పుల ప్రభావం శాఖోపశాఖలుగా విస్తరించి మన రాష్ట్రాన్నే కాదు మొత్తం మన దేశ భవిష్యత్తునే దెబ్బ తీసే అవకాశం ఉంది. వాతావరణాన్ని పరిరక్షించటం అనే పెను సవాలు నేడు మన ముందు ఉన్న పెద్ద ప్రశ్న. సరి అయిన మార్గాన్ని ఎంచుకోవటంద్వారా మనమే కాదు మన ముందు తరాలను రక్షించుకోవచ్చు. 

 

పర్యావరణ పరిరక్షణా విధానాలను సమర్ధిస్తూ శ్రీ ఆదిత్యగారు చురుకుగా శ్రమిస్తున్నారు. ఆయన నాయకత్వంలో MCR ఫౌండేషన్ కూడా వాతావరణంలోని మార్పులపై దృష్టిని ఉంచి హానికరమైన విడుదలను తగ్గించటానికి, అరికట్టటానికి అవగాహన కలిగిస్తోంది. 

 

రానున్న కాలంలో సంభవించబోయే వాతావరణంలోని మార్పులపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల శ్రీ ఆదిత్యగారి లక్ష్యాలు:

  • శిలాజ ఇంధనాల వాడుకను తగ్గించటం, శుభ్రమైన మరియు ఇతర శక్తి వనరులను ఉపయోగించటం.
  • అవసరమైన రంగాలలో శక్తి వనరుల వాడుకను పెంపొందించటం. 
  • ఆకుపచ్చని శక్తివనరుల వాడకం అన్ని రకాల రవాణా రంగాల్లో, గృహ మరియు పరిశ్రమల్లో ప్రోత్సహించటం.
  • అవగాహనా కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించటం. 
  • అడవులను నరకకుండా నిరోధించటం, వ్యవసాయ రంగంపై పడే దుష్ఫలితాల పట్ల రైతులకు అవగాహన కల్పించటం ద్వారా పచ్చదనాన్ని నగరాల్లో కూడా పెంపొందించవచ్చు. 

 

శ్రీ ఆదిత్యగారు ప్రస్తుతం అమలుపరుస్తున్న లక్ష్యాలు:

  • పునరుత్పాదక కంపెనీల బాగస్వామ్యంతో, స్వచ్చంధసంస్థలను, దాతలను అందరిని కలుపుకొని వాతావరణ మార్పులవల్ల కలిగే సమస్యలపై పోరాటం. 
  • వాతావరణం సమర్ధవంతంగా మారటానికి అనువైన యోచనలు, ప్రణాళికలు రూపొందించి ప్రజలకు అండగా నిలబడుతున్నారు. 
  • పాతవి, సాధారణమైనవి అయిన శిలాజ ఇంధనంవాడుకను, బొగ్గువంటి వనరుల స్థానంలో సోలార్, గాలిమరల మరియు పచ్చదనం నుంచి ఉత్పత్తి అయ్యే వాయువులను ఉపయోగించటానికి అవసరమైన మార్పుకి ప్రయత్నిస్తున్నారు. 
  • పునరుత్పాదక అంశాలపై రైతులకు అవగాహన కలిగించటం మరియు వాతావరణ కాలుష్యం పాడిపంటలకు ఏ విధంగా హాని / నష్టం కలిగిస్తుంది అని వివరించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం తో తమ పంటలను రక్షించుకోవటం ఎలా అనే అంశాలపై దృష్టి సారిస్తున్నారు. 
  • అనుకూల వ్యవసాయ యోచనల గురించిన అవగాహనా కార్యక్రమాలు 

 

….

 

పనులు

తెలంగాణ ప్రజలకు అంకితం చేయపడిన

వ్యవసాయం

రైతుల సహాయం మరియు వ్యవసాయ సంఘం

Adithya Marri Reddy Potography Pothole

పట్టణ అవస్థాపన

పట్టణ అవస్థాపన అభివృద్ధి వైపు కృషి చేయడం

Adithya Marri Reddy Agriculture

వాతావరణ మార్పు

రాబోయే తరానికి ప్రభుత్వంలో సరైన మార్పులు చేయడం

విద్య 

అందరి విద్య కోసం కట్టుపడ్డాం

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి పట్ల కట్టుపడ్డాం

మహిళల సాధికారత

మహిళల ఆర్ధిక మరియు సామజిక స్థిరత్వం వైపు కృషి చేయడం

Copyright @ 2018. All Right Reserved. adithyamarri.com

Bitnami