Click on Telugu to change language

విద్యాప్రమాణాలు పెంపొందించుట

young leader for a young state

సంగంలో నాణ్యతాపరమైన, సమాన విద్యావకాశాలు అందించటం ద్వారా అందరికి స్థిరమైన అవకాశాలు లభించి నిరంతరంగా ఉండే అసమానతలు తొలగిపోతాయి అని శ్రీ ఆదిత్యగారు తరచూ ప్రస్తావిస్తారు. ప్రాధమిక విద్య, అటుతరువాత యువతకు ఉన్నతవిద్యను వారికి అందుబాటులో సరసమైన ధరలకు అందించటం, నాణ్యతాపరమైన విద్యావ్యవస్థను నివాసితులందరికి అందుబాటులోకి తీసుకురావటం ద్వారా దారిద్ర్యాన్ని నిర్మూలించి ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలమని శ్రీ ఆదిత్యగారి నమ్మకం. కానీ దురదృష్టవశాతూ మన రాష్ట్రంలో విద్యావకాశాలు, వాటియొక్క ఫలితాలు చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. KG నుండి PG వరకు ఉచితవిద్య అని ప్రస్తుత ప్రభుత్వం చేసిన ప్రమాణాలు మిగిలిన అన్ని ప్రమాణాలకుమల్లేనే నెరవేర్చబడలేదు. 

 

వీటన్నిటికీ తోడూ అదనంగా 6 విశ్వవిద్యాలయాలు మాత్రం రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు కలిగిన విద్యను అందిస్తున్నాయని నేషనల్ అస్సేన్స్మెంట్ అండ్ అక్క్రిడేషన్ కౌన్సెల్ (NAAC) తెలియచేసింది. ప్రస్తుతం విద్యనందిస్తున్న అనేక యూనివర్సిటీలు UGC ప్రకారం సెక్షన్ 12(బి)(2) గుర్తింపు పొందలేదని తెలుస్తోంది. 

 

ఒక సమగ్రమైన విద్యావిధానాన్ని అమలు పరచటంద్వారా ఏ ఆర్ధిక స్థాయిలో ఉన్న విద్యార్థులైనా, పాఠశాలను మధ్యలో విడిచిపెట్టి వెళ్లిన విద్యార్థులకైనా విద్యను అభ్యసించే అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం కల్పించాలని శ్రీ ఆదిత్యగారి భావన. 

 

1979 లో స్వర్గీయులైన శ్రీ మర్రి చెన్నారెడ్డి గారు CBIT అభివృద్ధిని తన అంతర్నేత్రంతో వీక్షించినట్లుగానే ఆ సంస్థ అప్పటి నుంచే మంచి గుర్తింపును పొంది అటానమస్ స్థాయికి చేరింది. ఈ రకమైన ఆశతోనే వారసత్వపరంగా విద్యావకాశాలలో మంచిమార్పు కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)ను శ్రీ ఆదిత్యగారు వరంగల్‍లో నెలకొల్పారు. సత్యనాదెళ్ళ, శంతనునారాయణన్ లు పూర్వవిద్యార్థులుగా గుర్తింపుని పొంది, ప్రశంసలు అందుకొని భాగస్థులుగా ఉన్న ఆ విద్యా సంస్థలో ప్రతిష్టాత్మకమైన పూర్వవిద్యార్థి శ్రీ ఆదిత్యగారు. పూర్వ విద్యార్థుల సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గాను, కోర్ ఆర్గనైజింగ్ కమిటీ లోనే కాక బోర్డు అఫ్ గవర్నర్ లోను ఆయన సభ్యులు. 

 

గ్రామీణ అభివృద్ధిలో భాగంగా జిల్లాస్థాయిలో విద్యాసంస్థల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేసుకున్న ఆదిత్యగారు బాలబాలికలకు విద్యను అందించటం సంఘపరంగా అందరి భాద్యత అని భావిస్తారు. మూలాలను బలోపేతం చేయటం, చిన్నపిల్లలకు విద్యావకాశాలు కల్పించటం ద్వారా భవిష్యత్తు తరాల వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దటం వలన వారి ప్రతిభాపాటవాలు, శక్తిసామర్ధ్యాలు వెలికివస్తాయని శ్రీ ఆదిత్యగారి నమ్మకం. 

 

HPS బోర్డులో మెంబర్ అయిన ఆదిత్యగారు గుడ్‍ టచ్, బాడ్ టచ్ కార్యక్రమాన్ని పాఠశాలల్లో ప్రస్తావించి, అమలుచేసి బాలికలకు అవగాహన కలిగించటంద్వారా వారు శారీరకహింసా సంఘటనలకు గురికాకుండా, మంచికి చెడుకు గల తేడాను తెలుసుకోవాలని తపించారు. 10వ తరగతి నుండి పిల్లలకు భవిష్యత్తులో తాము ఏమి కోర్సు చదవాలి అనే అంశంపై అవసరమైన కెరీర్ గైడెన్స్ (career guidance) అవగాహన కార్యక్రమాలను స్కూల్ స్థాయి నుంచి మొదలుపెడితే వారికి నచ్చిన ఉన్నత విద్యలో చేరి చదువు పూర్తి చేసుకొని నచ్చిన వృత్తిలో స్థిరపడతారని శ్రీ ఆదిత్యగారి అభిప్రాయం.    

పనులు

తెలంగాణ ప్రజలకు అంకితం చేయపడిన

వ్యవసాయం

రైతుల సహాయం మరియు వ్యవసాయ సంఘం

Adithya Marri Reddy Potography Pothole

పట్టణ అవస్థాపన

పట్టణ అవస్థాపన అభివృద్ధి వైపు కృషి చేయడం

Adithya Marri Reddy Agriculture

వాతావరణ మార్పు

రాబోయే తరానికి ప్రభుత్వంలో సరైన మార్పులు చేయడం

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి పట్ల కట్టుపడ్డాం

మహిళల సాధికారత

మహిళల ఆర్ధిక మరియు సామజిక స్థిరత్వం వైపు కృషి చేయడం

Copyright @ 2018. All Right Reserved. adithyamarri.com

Bitnami