Click on Telugu to change language

వ్యవసాయం

Adithya Marri Reddy Work Agriculture

వ్యవసాయం అనేది భారతీయ సంస్కృతిలో అత్యంతముఖ్యమైన అంతర్భాగం. మనజీవితంలో దారపుపోగులా ముడిపడిఉంది. అంతటి ముఖ్యమైన అంశంలో చొరవచేసి శ్రీ ఆదిత్యగారు “”ఫార్మర్ కనెక్ట్”” ని స్థాపించి ముందుకు తీసుకువెళుతున్నారు.

 

ఎప్పుడైతే రైతు కుటుంబాలు అప్పులబాధతో, ఆర్ధిక ఇబ్బందులతో, అత్యధిక సంఖ్యలో తక్కువ దినసరి వేతనాలతో, తక్కువ గిట్టుబాటుధరలతో మరియు ఇతర సమస్యలతో సతమౌతూ బాధలు ఎదుర్కొంటుంటారో అప్పుడు మన గ్రామీణ వ్యవస్థ మొత్తం బాధలతో, సమస్యలతో సతమౌతుంది.

 

ప్రస్తుతం 5 రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలలో 90% రైతు ఆత్మహత్యలు తెలంగాణా రాష్ట్రంలోనే నమోదు చేయబడ్డాయి. 4 సంవత్సరాల TRS పాలనలో గ్రామీణ తెలంగాణా యొక్క అభివృద్ధి ప్రతి అంశంలోనూ దిగజారిపోయింది. 

 

All India Financial Inclusion 2016-17 కి సంబంధించిన ఒక సర్వే ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో అత్యధికంగా రైతుల రుణాలు 40% నమోదయ్యాయి. ఈ వైఫల్యాల ప్రభావాన్ని ముందుగా గమనించి తన విలువైన సమయాన్ని రైతులు మరియు గ్రామీణ వ్యవస్థపై వెచ్చించిన శ్రీ ఆదిత్యగారు పట్టణప్రాంతాలలోను, మిగిలిన తెలంగాణా రాష్ట్రమంతటిలోనే కాక గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన వ్యవస్థను తీసుకురావటం ఎంత అవసరమో తెలుసుకున్నారు.   

 

శ్రీ ఆదిత్యగారి “”ఫార్మర్ కనెక్ట్”” కార్యక్రమ లక్ష్యాలు: 

 • రైతుల విధులకు వారి రాబడికి తగిన భద్రత మరియు వారి జీవన ఆధారం పెంపుదల 
 • తెలంగాణా రైతుల ఎదుగుదల, సుసంపన్నత, వారి ప్రాముఖ్యత, మరియు వారు తాము వ్యవస్థకు అందిస్తున్న సహకారానికి గర్వించగలగటం. 
 • రైతుకి – వినియోగదారునికి మధ్య ఒక కొత్త గొలుసు విధానానికి ప్రణాళిక. 
 • వాతావరణ పరిరక్షణ పద్దతులను అనుసరించటం మరియు శాస్త్రీయ పద్దతులను ఉపయోగించి వారి ప్రాంతీయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరను పొందటం. 
 • ఉత్పత్తులను, ఆహార పదార్థాలను నిలువ చేసే ఆధునిక పద్దతిని పెంపొందించుట ద్వారా కొత్త ఉపాధిని సృష్టించటం.
 • మధ్యవర్తులు, దళారీలు లేకుండా fair trade పద్దతిని సృష్టించటం, మంచినాణ్యతా పద్దతులతో నిలువ చేసిన పదార్ధాలను నేరుగా కొనుగోలుదారునికి అందించటంద్వారా రైతుల జీవనప్రమాణం మెరుగుపడటం.
 • వనరుల సమాచార కేంద్రాలను స్థాపించి గ్రామీణ స్థాయిలో రైతులకు అవసరమైన మెళకువలు అందించటం.
 • పర్యావరణం, పచ్చదనం రక్షణ పద్దతులలో రైతులకు అవగాహన కల్పించటంద్వారా పంట దిగుబడి, తోటల పెంపకం, పశువులపెంపకంలో అభివృద్ధిని సాధించటం. 

 

ప్రస్తుతం శ్రీ ఆదిత్యగారు ఈ లక్ష్యాలను అమలు పరుస్తున్న విధానం: 

 • MCRF వారి అండతో రైతులకు – పరిశ్రమకు మధ్యన సంధానం. ఎక్కడైతే రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్దేశించి, పంటలలో రకాలను గురించి, విత్తన సౌకర్యం గురించి, వ్యవసాయ ప్రణాళికల గురించి, పంట పండుతావుంటే అవసరమైన సాంకేతిక సహాయం, పంట పండిన తర్వాత అవసరమైన సాంకేతిక అవసరాలు వంటి నికరమైన విషయాల గురించి తమ అభిప్రాయాలను వెలిబుచ్చగలగటం. 
 • ప్రాంతీయ అవసరాన్ని అనుసరించి వివిధరకాలుగా పరిష్కారాలతో రైతుకు అవసరమైన ధరకు సంబంధించిన అంశాలను తేలికగా పరిష్కరించుకోవటానికి గల అవకాశాలు సృష్టించుకోవటం. 
 • వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు సంబందించిన అన్ని సమస్యలపైనా రైతులకు అవసరమైన సమాచారం మరియు పరిష్కారాలు, సూచనలు అందించటానికి సహాయపడటం. ఉదా:: అందుబాటులోకి వచ్చిన విత్తనరకాలు, ఉత్తమమైన ఎరువులు, మద్దతుధరతో వ్యవసాయరంగ పనిముట్లు అందుబాటులోకి తీసుకురావటం,, శిక్షణ మరియు సమాచారం. 
 • తక్కువ భూమి, తక్కువ నీరు, తక్కువ ఎరువుల వాడకంతో ఎక్కువ పంట దిగుబడికి సాంకేతిక పరిజ్ఞానం మరియు వ్యవసాయరంగంలో ఆధునిక పద్దతులపై రైతులకు నైపుణ్యాలను పెంపొందింపచేయటం. 
 • నూతన వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణల పట్ల రైతులను విద్యావంతులనుగావించటం ద్వారా, చిన్నతరహా రైతులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు గురించిన సమాచార సహాయం. 
 • ప్రభుత్వ పథకాలగురించిన అవగాహన రైతులకు కల్పించటం మరియు వారికి నిధులు సమకూరే యంత్రాగముతో జతపరచటం. 
 • MCRF ద్వారా పంటలు లేని కాలంలో రైతులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించటం.. ఉదా: పూలతోటలు పెంపకం మరియు ఉద్యానవనాలు పెంపకం. అధికూడా రైతుల నివాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయటం.
 • పంట చేతికి అందివచ్చిన తరువాత ఆ పంటను నిలువ చేయటానికి తగ్గ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించటం. ఉదా: సౌరశక్తిని వినియోగించటం, గ్రీన్ హౌస్ సోలార్ డ్రైయ్యర్స్ ని, బబుల్ డ్రైయ్యర్స్ ని వినియోగించటంలో శిక్షణ, అవగాహన కల్పించటం. 
 • రైతుల కోసం మొబైల్ ఫోన్‍లో స్నేహపూరితమైన యాప్స్‍కి సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందించటం, వ్యవసాయరంగంలో కొత్త పుంతలను, పనిముట్లను, పద్దతులను పరిచయం చేయటం. అంతేకాక మొబైల్ ద్వారా కొత్తపంటలు పండించేవారిని, వినియోగదారులను అనుసంధానం చేయటం మొదలైనవి. 

 

Adithya Marri Reddy Work Agriculture

పనులు

తెలంగాణ ప్రజలకు అంకితం చేయపడిన

Adithya Marri Reddy Potography Pothole

పట్టణ అవస్థాపన

పట్టణ అవస్థాపన అభివృద్ధి వైపు కృషి చేయడం

Adithya Marri Reddy Agriculture

వాతావరణ మార్పు

రాబోయే తరానికి ప్రభుత్వంలో సరైన మార్పులు చేయడం

విద్య 

అందరి విద్య కోసం కట్టుపడ్డాం

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి పట్ల కట్టుపడ్డాం

మహిళల సాధికారత

మహిళల ఆర్ధిక మరియు సామజిక స్థిరత్వం వైపు కృషి చేయడం

Copyright @ 2018. All Right Reserved. adithyamarri.com

Bitnami